కలం డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.30 కోట్లు రాబోతున్నట్టు తెలుస్తోంది. పవన్ కు కొండగట్టు(Kondagattu) ఆంజనేయ స్వామి అంటే ప్రత్యేక నమ్మకం. తనను గతంలో ప్రమాదం నుంచి కొండగట్టు అంజన్న కాపాడాడు అంటూ ఎన్నోసార్లు చెప్పాడు. 2024 జూన్ లో కొండగట్టు దర్శనానికి వచ్చినప్పుడు భక్తలు సౌకర్యం కోసం 100 గదులు, దీక్షా మండపం నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ ఆలయ నిర్వాహకులు కోరారు. దానిపై అప్పుడు పవన్ సానుకూలంగానే స్పందించారు.
ఇప్పుడు టీటీడీ(TTD) బోర్డుకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సిఫార్సులు చేసినట్టు సమాచారం. కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.30 కోట్లు కేటాయించాలని కోరారంట. దీనిపై త్వరలోనే టీటీడీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంజన్న భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: లొంగిపోయిన మావోయిస్టులకు బంపర్ ఆఫర్
Follow Us On: X(Twitter)


