epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సర్.. జి రామ్ జి.. శాంతి!

కలం, వెబ్​డెస్క్​: పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు (Parliament winter session)  ముగిశాయి. రెండు సభలు 19రోజుల పాటు సమావేశమయ్యాయి. పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్​ఆర్​ఈజీఏ) పేరు మార్పు, అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించే బిల్లు ముఖ్యమైనవి. శుక్రవారం లోక్​సభ ప్రారంభం కాగానే ఈ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులు, జరిపిన చర్చలు తదితర వాటి గురించి స్పీకర్​ ఓం బిర్లా క్లుప్తంగా చదివి వినిపించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆఖరి రోజు సైతం కొందరు ప్రతిపక్ష సభ్యులు సభలో ‘మహాత్మా గాంధీ కి జై’ నినాదాలు చేశారు. కాగా, ఈ సమావేశాల్లోనే 150 ఏళ్ల వందేమాతరంపై  ప్రత్యేక చర్చ జరిగింది. అలాగే ఢిల్లీ ఎయిర్​ పొల్యూషన్​ గురించీ వాడీవేడీ చర్చ జరిగింది.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్​) గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినా ప్రభుత్వం అంగీకరించలేదు. కేవలం ఎన్నికల సంస్కరణలపై మాత్రం చర్చ జరిగింది. ‘సర్’, ప్రధాన ఎన్నికల కమిషనర్​ నియామకం, ‘వోట్​ చోరీ’పై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టాయి. ఎంజీఎన్​ఆర్​ఈజీఏ స్థానంలో వికసిత్​ భారత్​ జి రామ్​ జి బిల్లు, న్యూక్లియర్​ రంగంలో ప్రైవేట్​ పెట్టుబడులకు ‘శాంతి’​ బిల్లు ప్రతిపక్షాల నిరసనల మధ్య పాస్​ అయ్యాయి. అలాగే ఇన్సూరెన్స్​ సెక్టార్​లో 100శాతం ఎఫ్​డీఐలకు ఆమోదిస్తూ సవరణ బిల్లు ‘సబ్​కా  బీమా సబ్​కీ రక్ష’  పాస్​ అయ్యింది. ఉన్నత విద్యలో అన్ని విభాగాలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు ఉద్దేశించిన ‘వికసిత్​ భారత్​ శిక్షా అధిష్టాన్’ బిల్లు జాయింట్​ కమిటీ ఆమోదానికి పంపారు. ​మొత్తానికి ఈ సమావేశాల్లో (Parliament winter session ) సర్​.. మహాత్మాగాంధీ.. జి రామ్​ జి.. శాంతి పదాలు మారుమోగాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>