కలం వెబ్ డెస్క్ : శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన భారత రాష్ట్రపతి(President of India) ద్రౌపది ముర్ము(Droupadi Murmu) నేడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సు(PSC national seminar)లో హాజరయ్యేందుకు రామోజీ ఫిలింసిటీ(Ramoji Film City)కి చేరుకున్నారు. ముందుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఫిలింసిటీకి వచ్చారు. దేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించిన సదస్సులో రాష్ట్రపతి పాల్గొననున్నారు.
రాష్ట్రపతి వెంట గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, మంత్రి సీతక్క ఉన్నారు. ఈ సదస్సులో యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ అజయ్‌కుమార్, టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. డిసెంబర్ 22 వరకు రాష్ట్రపతి హైదరాబాద్‌లో బస చేయనున్నారు.


