కలం వెబ్ డెస్క్ : ఐబొమ్మ నిర్వాహకుడు రవి(iBomma Ravi)ని మూడోసారి సైబర్‌క్రైమ్(Cyber Crime) పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. 12రో జుల పాటు అతన్ని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు.ఈ క్రమంలో ఐబొమ్మ రవితో పాటు టచ్‌లో ఉన్న మరికొందరి పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెచ్డీ సినిమాల్ని ఎలా పైరసీ(Piracy) చేస్తారనే విషయంపై పూర్తి సమాచారాన్ని ఇచ్చేశాడట.
విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనే ఇద్దరి పేర్లు రవి(iBomma Ravi) చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వారు కూడా కీలకంగా ఉన్నారని తేలింది. వీరిలో ప్రసాద్ మాత్రం రవికి పదో తరగతి స్నేహితుడని చెప్పాడట. ప్రహ్లాద్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. ప్రహ్లాద్ పేరుతోనే ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సును రవి తీసుకున్నాడు. కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వం కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉంది. చివరకు ఐబొమ్మ వెబ్సైట్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే రిజిస్టర్ చేయించాడు. మొదట్లో ప్రహ్లాద్‌ను అమీర్‌పేట్‌లో కలిశానని చెప్పిన రవి తర్వాత అతని గురించి ఎలాంటి వివరాలు రవి చెప్పలేదని అధికారులు వెల్లడించారు.
Read Also: అరకు కాఫీ అదరహో.. కేజీ ఎంతంటే!
Follow Us On: Youtube


