కలం, వెబ్ డెస్క్: Araku Coffee | అనేక దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతంలో పండించే కాఫీ గింజలకు మంచి డిమాండ్ ఉంది. మంచి రుచి ఉన్న అరకు కాఫీకి తగినంత మార్కెటింగ్ లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా అంతగా గుర్తింపు సొంతం చేసులేకపోయింది. అరకు కాఫీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచడానికి ఏపీ ప్రభుత్వం ఆనంద్ మహీంద్రాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతుండటంతో మంచి లాభాలొస్తున్నాయి.
ఇప్పుడు అక్కడ పండించే కాఫీ పొడి కిలో రూ.10,000కు అమ్ముడవవుతోంది. ఇటీవల అరకు కాఫీ (Araku Coffee) ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించడంతో 24 గంటల్లోనే మంచి రెస్పాన్ వచ్చింది. అరకు కాఫీ అంతర్జాతీయంగా మంచి రేటింగ్ సొంతం చేసుకోవడంతో స్థానిక రైతులు వ్యక్తిగతంగా కాఫీ సాగు చేస్తున్నారు.


