కలం, వెబ్ డెస్క్: రోజురోజుకూ సైబర్ క్రైమ్ పెరిగిపోతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఓటీపీ, ఆధార్ అప్డేట్, మ్యాట్రిమోనీ, ప్రభుత్వ పథకాలు అంటూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ఈసారి ఆర్బీఐని కూడా వదలడం లేదు. ఆర్బీఐ ‘ఉద్గమ్’ (RBI Udgam) పేరు మోసాలకు పాల్పడటం పోలీసుల దృష్టికి కొచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. అనవసర లింకులు ఓపెన్ చేయొద్దని సూచిస్తున్నారు.
బ్యాంకుల్లో ఎన్నో ఏళ్లుగా ఉండిపోయిన పైసలు (Unclaimed Deposits) ఇప్పిస్తామంటూ జనం నెత్తిన టోపీ పెడుతున్నారు. ఆర్బీఐ తీసుకొచ్చిన ‘ఉద్గమ్’ (UDGAM) పోర్టల్ పేరు మోసాలు చేస్తున్నారు. “మీ పాత ఖాతాల్లో లక్షలున్నయ్.. ఈ లింక్ క్లిక్ చేసి తీసుకోండి” అని మెసేజ్‌లు, మెయిల్స్ పంపిస్తున్నారు. ఆశపడి ఆ లింక్ క్లిక్ చేస్తే.. ఫోన్ హ్యాక్ అవుతుంది. క్షణాల్లో బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది.
ఈ జాగ్రత్తలు మస్ట్
– ఆర్బీఐ ఎప్పుడూ మీ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు అడగదు. ఆఫీసర్లు అని ఫోన్ చేస్తే నమ్మకండి.
– అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్ల కోసం https://udgam.rbi.org.in అనే వెబ్‌సైట్ మాత్రమే చూడాలి.
– వాట్సాప్, మెయిల్స్‌లో వచ్చే లింకులను క్లిక్ చేయొద్దు.
– ఒకవేళ మోసపోతే 1930 నంబర్‌కు కాల్ చేయండి. లేదంటే http://cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.
Read Also: ప్రభాకర్‌రావు కస్టడీ 25 వరకు కంటిన్యూ
Follow Us On: Sharechat


