కలం వెబ్ డెస్క్ : పంచాయతీ ఎన్నికల్లో(Panchayat Elections) రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా వ్యవహరించాయి. ఇక ఎన్నికలు పూర్తయ్యాక మేమే ఎక్కువ స్థానాలు గెలిచామంటూ పరస్పరం సంబరాలు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా వరంగల్(Warangal)జిల్లాలో మరో అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడకపోవడమే ఇందుకు కారణం!
వరంగల్(Warangal) జిల్లా ఖానాపురం మండలం కీర్యా తండాలో ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. కీర్యా తండాలో మొత్తం ముగ్గురు పోటీలో ఉండగా 239 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ(BJP) మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బోడ గౌతమి బరిలో ఉన్నారు. ఎన్నికల్లో బోడ గౌతమికి ఒక్క ఓటు కూడా పడలేదు. చివరికి నోటా(NOTA)కు సైతం ఒక ఓటు పడింది కానీ గౌతమికి ఒక్క ఓటు కూడా పడకపోవడంతో అసలు ఆమె అయినా తన ఓటు తనకు వేసుకుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.
Read Also: రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్న రాష్ట్రపతి
Follow Us On: Pinterest


