కలం వెబ్ డెస్క్ : శ్రీశైలం ఆలయ పరిసరాల్లో రీల్(Srisailam Temple Reel) చేసి భక్తుల ఆగ్రహానికి గురైన యువతి ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చింది. “లొకేషన్ బాగుందని పద్ధతిగా చీర కట్టుకుని రీల్ చేశానంటూ వివరణ ఇచ్చుకుంది. నేను గుడి బయట రోడ్డు మీద మాత్రమే రీల్ చేసుకున్నా.. నేనేమీ పొట్టి పొట్టి బట్టలు వేసుకుని చేయలేదుగా.. చీర కట్టుకొని సాంప్రదాయంగా చేశా.. దానికే ఇష్టమొచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు” అంటూ వాపోయింది. నేనేం తప్పు చేయలేదు.. నేను తప్పు చేశానని మీరు అనుకుంటే క్షమించండి అంటూ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. సదరు యువతి ఆలయ పరిసరాల్లో చేసిన రీల్ ఒక్క రోజులోనే వైరల్‌గా మారింది. ఆలయ పరిసరాల్లో ఇలాంటివి అనుమతించొద్దంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: అరకు కాఫీ అదరహో.. కేజీ ఎంతంటే!
Follow Us On: Instagram


