నిస్సిగ్గుగా రైతులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ కోసం ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేస్తున్నానంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ రైతులను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో 65 ఏళ్లలో కాంగ్రెస్ ఇవ్వలేని 24 గంటల కరెంట్‌ను 6 నెలల్లో కేసీఆర్ ఇచ్చి చూపించాడని కొనియాడారు.

రైతులకు యూరియా, రైతుబంధు ఇవ్వలేని రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ధాన్యం కొనలేని రేవంత్ రెడ్డి రైతు డిస్కం పెడతాడట అంటూ ఎద్దేవా చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. రేవంత్ రెడ్డికి రైతుల మీద అంత ప్రేమ ఉందని అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి “బాంబులేటి” అబద్ధాలు చెప్పి రెండేండ్లు గడిచిపోయాయని మండిపడ్డారు. ఉప ఎన్నికల సందర్భంగా పొంగులేటి లాంటి మంత్రులు వచ్చి 6,000 ఇండ్లు కంటోన్మెంట్‌కు ఇస్తామని చెప్పిన మాటను గుర్తుచేశారు. రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత కనీసం ఒక్క ఇంటిని కూడా కంటోన్మెంట్‌కి, హైదరాబాద్ నగర ప్రజలకు ఇవ్వలేదని దుయ్యబట్టారు.  కాంగ్రెస్ వచ్చిన తర్వాత పేదల ఇండ్లపై పడి ‘హైడ్రా’ భూతంతో వేలాదిమంది ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడుతుందని విమర్శించారు. కంటోన్మెంట్‌లో ఉన్న రక్షణ శాఖ భూములు ఇస్తే, అటు కరీంనగర్ వైపు, నిజామాబాద్ వైపు స్కైవేల నిర్మాణం చేస్తామని పదులసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఏనాడు స్పందించలేదన్నారు. హైదరాబాద్ నగరానికి అప్పటి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని అన్ని సీట్లలో బీఆర్ఎస్‌ని గెలిపించారని గుర్తుచేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>