కలం వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. వచ్చే సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్స్ కోసం సెన్సేషనల్ స్టార్ డైరెక్టర్ స్టోరీ రెడీ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? పవన్, బన్నీలో ఎవరితో ముందుగా సినిమా చేస్తారు?
పవర్ స్టార్.. ఐకాన్ స్టార్ .. ఈ ఇద్దరి కోసం కథలు రెడీ చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు.. లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj). కూలీ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధిస్తాడనుకుంటే ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో లోకేష్ కనకరాజ్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేదానిపై ఆసక్తి పెరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో ఖైదీ 2 ఉంటుందని వార్తలు వచ్చినా ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. అయితే తమిళ హీరోలు లోకేష్‌తో సినిమా చేయడం కోసం అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదో ఏమో కానీ తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
పవర్ స్టార్(Pawan Kalyan) కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశాడట. అలాగే ఐకాన్ స్టార్ కోసం ఓ సూపర్ మేన్ స్టోరీ రెడీ చేశాడట. దీంతో లోకేష్ సినిమా పవన్ తో ఉంటుందా? బన్నీతో ఉంటుందా? అనేది ఆసక్తిగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో లోకేష్ కనకరాజ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రచారం జరుగుతుంది కానీ ఏ హీరోతో ఉంటుందనేది మాత్రం క్లారిటీ లేదు. మరో వైపు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో కూడా లోకేష్ సినిమా ఉంది. దీంతో లోకేష్ నెక్ట్స్ ఎవరితో అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలా మారింది.
Read Also: అదిరిన శేష్ మాస్ లుక్… అంచనాలు పెంచేసిన డెకాయిట్ టీజర్..
Follow Us On: Sharechat


