కలం వెబ్ డెస్క్: Nirmal | ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కొత్త సర్పంచులు పదవీ బాధ్యతలు చేపట్టి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామంలో పేరుకుపోయిన సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. ప్రధాన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని చాలా గ్రామాల్లో కోతుల బెడద నెలకొంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరూ కనబడినా కరిచేస్తున్నాయి. అంతేకాదు.. చేతకొచ్చిన పంటలకు నష్టం కలిగిస్తున్నాయి.
ఈ క్రమంలో ఇటీవల గెలిచిన ఓ సర్పంచ్ చక్కని పరిష్కారం చూపారు. ఎవరో కాదు.. తానే ఒక్క అడుగు వేసి కోతుల సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నిర్మల్(Nirmal) జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. గతంలో ఇంటికి రూ.50 రూపాయల చొప్పున వసూలు చేసి బోన్లు ఏర్పాటు చేశారు. అయినా ఫలితం ఇవ్వలేదు. కోతుల బెడదను అరికట్టేందుకు నూతనంగా సర్పంచ్‌గా ఎన్నికైన కుమ్మరి రంజిత్ కోతుల వినూత్న ప్రయత్నం చేశాడు. చింపాంజీ (Chimpanzee) వేషధారణలో గ్రామంలో తిరుగుతూ కోతులను భయపెడుతున్నాడు. సర్పంచ్ ప్రయత్నాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
Read Also: పబ్‌లు, ఫామ్‌హౌస్‌ల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
Follow Us On: Instagram


