కలం, వెబ్ డెస్క్ : శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వస్తున్న మూవీ ఛాంపియన్. దీన్ని ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ నెల 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. దీనికి రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. ఇందులో రామ్ చరణ్ (Ram Charan) మాట్లాడుతూ.. ‘రోషన్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అచ్చం హాలీవుడ్ హీరోలాగా చాలా అందంగా ఉంటాడు. నాకు రెండో మూవీ మగధీర ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో.. ఈ సినిమా రోషన్ కు అలాంటి హిట్ ఇవ్వాలి. రోషన్ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. వైజయంతి మూవీస్ వాళ్లు ఎప్పుడూ నాకు స్పెషలే’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ (Ram Charan).
తాను మెగాస్టార్ కొడుకు అయినా యాక్టింగ్ ఎలా చేస్తామో తెలియకపోయినా చిరుత మూవీతో నాకు అవకాశం ఇచ్చారు. అశ్వనీదత్ చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. ఆయనతో మరో సినిమా చేస్తా. ఎందుకంటే అలాంటి పర్ఫెక్షన్ ఉన్న నిర్మాతతో పనిచేస్తే నాకు చాలా ఈజీ అవుతుంది. అశ్వనీదత్ తర్వాత ఆయన వారసులుగా ప్రియాంక, స్వప్న చాలా బాగా పనిచేస్తున్నారు. ఆయన పేరును మరింత పెంచాలి అంటూ కోరుకున్నారు రామ్ చరణ్. ఛాంపియన్ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటోంది. ఇందులో స్వాతంత్య్రం రాకముందు ఉన్న పరిస్థితులు కూడా చూపించారు. మరి సినిమా ఎలా ఉంటుందో వెయిట్ చేద్దాం.


