కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ గ్రూప్ – 3 పరీక్షల (Group3 Result) ఫలితాలు వచ్చాయి. ఈ మేరకు అభ్యర్థుల సెలక్షన్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,370 మంది ఎంపికైనట్లు ప్రకటించింది. అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెబ్ సైట్ లో అందుబాటులో పెట్టింది. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ – 3 ఎగ్జామ్స్ జరగగా .. ఇటీవల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఇంకా ఒక పోస్ట్ వెరిఫికేషన్ కోసం పెండింగ్ లో ఉన్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. మరో 17 పోస్టుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. జూనియర్ అసిస్టెంట్, ఎల్డీ స్టెనో, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ – 3 (Group3 Result) పరీక్షలకు సుమారు 2.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.


