దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్ర ప్రభుత్వం

కలం, వెబ్ డెస్క్: దేశంలో పెట్రోల్, డీజిల్ (Petrol Diesel) కొరత ఏమాత్రం లేదని.. సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సహజ గ్యాస్, చమురు ఉత్పత్తులు నిరాటంకంగా రవాణా జరుగుతున్నాయని.. దేశీయంగా ఉత్పత్తి ఎక్కడా తగ్గలేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ (Sujatha Sharma) తెలిపారు. ప్రతి రోజు సుమారు 92 టీఎంటీల ఉత్పత్తి జరుగుతోందన్నారు. వినియోగదారులు అనవసరంగా కంగారు పడొద్దని.. అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని ఇప్పటికే చమురు కంపెనీలు సూచిస్తున్నట్లు పేర్కొన్నారు.

సిలిండర్ల కొరత లేదు..

దేశ ప్రజలకు సరిపడా గ్యాస్ సిలిండర్లను ఎప్పటికప్పుడు రవాణా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని సుజాత శర్మ వివరరించారు. అంతేగాకుండా, దేశంలోని అన్ని బంకులకు పెట్రోల్, డీజిల్ (Petrol Diesel) నిరంతరాయంగా సరఫరా అవుతూనే ఉందన్నారు. ఈ విషయంలో ఎలాంటి అవాస్తవాలను నమ్మొద్దని.. అనవసరంగా ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.

Read Also: సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణ స్వీకారం డేట్‌ ఫిక్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>