కలం, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు (Supreme Court)లో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట దక్కింది. వనస్థలిపురం దగ్గర్లో సాహెబ్ నగర్ లో ఉన్న 102 ఎకరాల భూమి తమదే అని.. తాము నిజాం, సాలార్ జంగ్, మీరాలం వారసులం అంటూ కొందరు 20 ఏళ్ల కింద హైకోర్టులో పిటిషన్లు వేశారు. అప్పుడు వాళ్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సుదీర్ఘ కాలంగా సాగిన ఈ కేసులో నేడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.
ఈ భూమి మొత్తం తెలంగాణ అటవీశాఖకు చెందినదే అంటూ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వానికి పూర్తి హక్కులు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎనిమిది వారాల్లోపు ఆ భూమిని రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించి నోటిఫికేషన్ ప్రతిని సుప్రీంకోర్టుకు పంపాలని సీఎస్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు(Supreme Court) .
Read Also: నా మనవడిని మెస్సీ మ్యాచ్కు అందుకే తీసుకెళ్లా : సీఎం రేవంత్
Follow Us On: Sharechat


