కలం వెబ్ డెస్క్ : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన జీ-రామ్-జీ బిల్లు(G RAM G Bill)కు లోక్‌సభ(Lok Sabha)లో తీవ్ర గందరగోళం నడుమ ఆమోదం లభించింది. ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ కేంద్రం సోమవారం పార్లమెంట్(Parliament) లో బిల్లు ప్రవేశపెట్టింది. విపక్ష నేతలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రజల హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎదుట ఆందోళనకు దిగారు. పార్లమెంట్‌లో బిల్లును వ్యతిరేకిస్తూ బిల్లు ప్రతులను చించేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని చట్టంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఈ గందరగోళం మధ్యనే బిల్లును ఆమోదించారు.
Read Also: స్టూడెంట్స్‌కు ల్యాప్‌టాప్‌లు.. తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్
Follow Us On : WhatsApp


