సీఎంతో మాకు విభేదాల్లేవు : మంత్రి కొండా సురేఖ

కలం, వరంగల్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి తో తమకు ఎలాంటి విభేదాలు లేవని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి సన్మాన సభ ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని డి కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి, తమకు శత్రువు ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక్కరేనని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఎన్నికైన నాటి నుంచి తమకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. నాడు రాజశేఖర్ రెడ్డికి కేవీపీ లాగా వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి కుడిభుజంగా ఉంటూ పాలనలో తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read Also:  ఫ్యూచర్ సిటీ వివాదం.. ట్రబుల్‌లో ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు

Read Also: ఆమెకు రక్షణేది..?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>