కలం, వెబ్ డెస్క్: కర్నూలు (Kurnool) జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వేట ప్రారంభమైంది. ఇటీవల వర్షాలు కురవడంతో ప్రజలు వజ్రాల కోసం వెతకడం ప్రారంభించారు. రాయలసీమలో తొలకరి వర్షాలు కురవడంతో పొలాల్లో వజ్రాలు దొరుకుతాయన్న ఆశతో స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.
వర్షాల వల్ల నేలపై ఉన్న పైమట్టి కొట్టుకుపోయి వజ్రాలు బయటపడతాయన్న నమ్మకంతో ప్రజలు పొలాల్లో జల్లెడ పట్టే పనిలో నిమగ్నమవుతున్నారు. కుటుంబాలతో సహా వచ్చిన వారు ఫుడ్ క్యారేజీలు, అవసరమైన సామగ్రితో రోజంతా పొలాల్లోనే గడుపుతున్నారు.
ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభం కాగానే ఈ ప్రాంతంలో వజ్రాల వేట సాధారణ దృశ్యంగా మారింది. చిన్న వజ్రం దొరికినా జీవితమే మారిపోతుందన్న ఆశతో వేట కొనసాగుతుండటం స్థానికంగా పరిపాటిగా కనిపిస్తోంది.
Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!
Read Also: క్యాన్సర్ రోగుల పాలిట సంజీవని.. డాక్టర్ సదాశివుడు!

