కలం వెబ్ డెస్క్ : పవిత్ర శ్రీశైలం క్షేత్రం(Srisailam Temple)లో ఆధ్యాత్మికతతో వ్యవహరించాల్సింది పోయి ఓ యువతి రీల్స్ చేస్తూ కుప్పిగంతులు వేసింది. దీంతో భక్తుల(devotees) ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. క్షేత్రంలో శివ నామ మంత్రం మోగుతుండగా ప్రధాన వీధుల్లో, సీఆర్ఓ కార్యాలయం సమీపంలోని రోడ్డు మీద ఓ యువతి జానపద పాటలకు రీల్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భక్తి, శాంతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే పవిత్ర ప్రదేశంలో సోషల్ మీడియా మోజుతో రీల్స్ చేయడంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇలాంటి చర్యలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: బీఆర్ఎస్.. కాంగ్రెస్.. దొందూ.. దొందే..
Follow Us On : WhatsApp


