కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) సమర్పించిన అఫిడవిట్‌పై మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని కడియం చేసిన ప్రకటనను నిస్సిగ్గు ప్రవర్తనగా ఆయన అభివర్ణించారు. ఈ అబద్ధాలతో సభ్య సమాజం సిగ్గుపడేలా చేశావని, ఘనపూర్ ప్రజలకు నీ ముఖం ఎలా చూపిస్తావని రాజయ్య ఫైర్ అయ్యారు. ఫిరాయింపు ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad) కు అఫిడవిట్ సమర్పిస్తూ.. తాను బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని పేర్కొన్నారు.
ఈ అఫిడవిట్‌పై తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) తీవ్రంగా స్పందించారు. నిస్సిగ్గుగా కడియం శ్రీహరి నిన్న స్పీకర్‌కు అఫిడవిట్ సమర్పించాడన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సభ్య సమాజం సిగ్గుపడేలా కడియం తన ప్రవర్తనను మరోసారి బయటపెట్టాడని ఆరోపించాడు. స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది.
Read Also: వెరీ బ్యాడ్.. 2,081 ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలే లేరు!
Follow Us On: Sharechat


