కలం, వెబ్ డెస్క్: కొమురంభీమ్ ఆసిఫాబాద్ (Kumuram Bheem Asifabad) జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కెరమెరి మండలం పరందోలి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ పత్తి చేనులో దూసుకెళ్లింది. ఈ ఘటనలో 30 మంది గాయాల పాలైనట్లు సమాచారం. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ బస్సును పత్తి చేనులోకి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన బాధితులను రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: ప్రముఖ శిల్పి రామ్ సుతార్ కన్నుమూత
Follow Us On: Pinterest


