కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ పాఠశాలల (Government Schools) బలోపేతానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అమలు కావడం లేదు. పిల్లల హాజరు శాతం తగ్గిపోతుందే తప్పా.. పెరగడం లేదు. కొన్ని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య జీరోగా ఉందంటే ప్రభుత్వ బడుల పరిస్థితిని తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో 2024–25 విద్యా సంవత్సరంలో దేశమంతటా 5,149 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎవరూ లేరని, తెలంగాణలో 70 శాతం ఉందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నివేదిక ప్రకారం.. తెలంగాణ 2,081 పాఠశాలలతో అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ 1,571 పాఠశాలలతో రెండో స్థానంలో ఉంది. పిల్లలు లేని బడుల్లో తెలంగాణలోని నల్గొండ జిల్లా అత్యధికంగా ఉంది. 315 పాఠశాలలు సున్నా నమోదును చూపించాయి. తెలంగాణలో మహబూబాబాద్ (167), వరంగల్ (135) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 211 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేరని నివేదించారు. పది మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న లేదా అసలు విద్యార్థులే లేని పాఠశాలల సంఖ్య పెరగడంపై మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఇటువంటి పాఠశాలల సంఖ్య 2022–23లో 52,309 నుండి 2024–25 నాటికి 65,054కి పెరిగిందని నివేదిక పేర్కొంది.
ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల (Teachers) సంఖ్య పెరిగిందని డేటా కూడా చూపిస్తుంది. 2022–23లో, దాదాపు 1.26 లక్షల మంది ఉండగా, 2024–25 నాటికి, ఆ సంఖ్య 1.44 లక్షలకు పెరిగింది. మొత్తంమీద, భారతదేశం అంతటా మొత్తం ప్రభుత్వ పాఠశాలల(Government Schools) సంఖ్య గత ఐదు సంవత్సరాల్లో తగ్గింది.
Read Also: కామెరూన్ మరోసారి తన సిగ్నేచర్ స్టైల్‌ను చూపించారు: సుకుమార్
Follow Us On: Sharechat


