epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ప్ర‌ముఖ శిల్పి రామ్ సుతార్ క‌న్నుమూత‌

క‌లం వెబ్ డెస్క్ : గుజరాత్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(Statue of Unity)కి రూపకల్పన చేసిన ప్ర‌ముఖ‌ భారతీయ శిల్పి రామ్ వంజీ సుతార్(Ram Sutar) కన్నుమూశారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో తన కుమారుడి నివాసంలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రామ్ సుతార్ కొద్ది రోజుల నుంచి ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్నారు. బుధ‌వారం రాత్రి రామ్ సుతార్ త‌మ నివాసంలో తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుమారుడు అనిల్ సుతార్ వెల్ల‌డించారు.

1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని ధులే జిల్లాకు చెందిన గోందూర్ గ్రామంలో జన్మించిన రామ్ సుతార్ చిన్నతనం నుంచే శిల్పకళపై ఆసక్తి చూపారు. ఆయన రూపొందించిన‌ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా పేరుగాంచింది. హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం, పార్లమెంట్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వంటి అనేక ఐకానిక్ శిల్పాల‌ను రామ్ సుతార్(Ram Sutar) రూపొందించారు. శిల్ప క‌ళ‌లో ఆయ‌న సేవ‌ల‌కు గానూ 1999లో పద్మశ్రీ(Padma Sri), 2016లో పద్మభూషణ్(Padma Bhushan) పురస్కారాలు లభించాయి.

Read Also: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్స్.. వడ్డీ ఎక్కువ రిస్క్ తక్కువ

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>