కలం వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)పై మరో కేసు నమోదైంది. వల్లభనేని వంశీ అనుచరులు తనపై 2024లో దాడి చేశారంటూ సునీల్ అనే వ్యక్తి మాచవరం(Machavaram)లో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సునీల్ ఫిర్యాదు మేరకు పోలీసులు వంశీ సహా మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఇళ్ల పట్టాలు, టీడీపీ ఆఫీస్‌పై దాడి తదితర కేసులో వల్లభనేని వంశీ 138 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి జూలైలో విడుదలయ్యారు. తాజాగా మరో కేసు నమోదవడం చర్చనీయాంశంగా మారింది.
Read Also: నేడు గవర్నర్‌తో వైయస్ జగన్ భేటీ
Follow Us On: Pinterest


