కలం వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్(YS Jagan) నేడు ఏపీ గవర్నర్(Governor) అబ్దుల్ నజీర్(Abdul Nazeer)తో భేటీ కానున్నారు. ఏపీలో మెడికల్ కాలేజీ(Medical Colleges)లను పీపీపీ మోడల్(PPP Model)లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా సంతకాల సేకరణ చేపట్టారు. ఆ సంతకాల ప్రతులను నేడు జగన్ గవర్నర్‌కు అందజేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా చేపట్టిన సంతకాల ప్రతులు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. నేడు ఆ సంతకాల పత్రాల వాహనాలను వైయస్ జగన్(YS Jagan) జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం గవర్నర్‌తో భేటీకి ముందు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. వైసీపీ ఆధ్వర్యంలో పీపీపీ మోడల్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటాల గురించి చర్చిస్తారు. అనంతరం పీపీపీ విధానం పట్ల రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాలను గవర్నర్‌కు వివరిస్తారు.
Read Also: ఢిల్లీ అలర్ట్.. పాత కార్లకు నో ఎంట్రీ
Follow Us On: Instagram


