కలం వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee)ల క్రేజీ కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పుడు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే(Deepika Padukone) నటిస్తున్నట్టుగా మరో వీడియో విడుదల చేశారు. అంతకు మించి ఎలాంటి అప్ డేట్ ఈ సినిమా నుంచి రాలేదు. ఇప్పుడు ఈ భారీ చిత్రాన్ని రెండు పార్టులుగా తీయనున్నారనే న్యూస్ వినిపిస్తోంది. మరి.. ఇది నిజమేనా..?
బాహుబలి సినిమాను దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) రెండు పార్టులుగా తీయడం.. ఆ రెండు పార్టులు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో ఒక కథను రెండు పార్టులుగా తీయడం అనేది ఓ ట్రెండ్ గా మారింది. బాహుబలి స్పూర్తితోనే.. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, పుష్ప, పుష్ప 2, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2, అఖండ, అఖండ 2.. ఇలా సీక్వెల్స్ వచ్చాయి. కల్కి(Kalki) వచ్చింది.. కల్కి 2 రావాల్సి ఉంది. అలాగే సలార్(Salar) వచ్చింది.. సలార్ 2 కూడా రావాల్సి ఉంది. దేవర(Devara) వచ్చింది.. దేవర 2 రావాల్సి ఉంది. రాజాసాబ్ రాబోతోంది.. దీనికి కూడా పార్ట్ 2 ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక పుష్ప 3, అఖండ 3 కూడా రానున్నాయని ప్రకటించారు.
ఇక అసలు విషయానికి వస్తే.. బన్నీ, అట్లీ మూవీని ఇన్ని రోజులు ఒక పార్ట్ గానే తీస్తారనుకున్నారు కానీ.. ఇప్పుడు ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా తీయాలని ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. మరి.. ఇది నిజమా..? లేక గాసిప్పా..? అంటే.. నిజమే అని తెలిసింది. త్వరలోనే ఈ క్రేజీ మూవీని రెండు పార్టులుగా తీస్తున్నట్టు అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ క్రేజీ మూవీ ఫస్ట్ పార్ట్ ను 2026లోనే రిలీజ్ చేస్తారని.. సెకండ్ పార్ట్ ను 2027లో రిలీజ్ చేయనున్నారని టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారా అని బన్నీ(Allu Arjun) ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Read Also: ది రాజాసాబ్ ప్రీమియర్లు అప్పుడే.. మూవీ టీమ్ క్లారిటీ
Follow Us On: Pinterest


