కలం వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) బుధవారం ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేయడంతో బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆధారాలు లేవని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్న స్పీకర్‌పై నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే టి. హరీశ్ రావు (Harish Rao) ఈ నిర్ణయాన్ని రాజ్యాంగ ఉల్లంఘనగా అభివర్ణించారు.
ఈ నిర్ణయంపై స్పందించిన హరీశ్ రావు (Harish Rao).. రాహుల్ గాంధీ ‘రాజ్యాంగాన్ని కాపాడండి’ నినాదం ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇచ్చిన తీర్పుతో బట్టబయలైందన్నారు. ఇది రాజ్యాంగాన్ని కాపాడటం కాదు అని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం దాన్ని మానిప్యులేట్ చేసి, దెబ్బతీస్తున్నారన్నారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై ఉపన్యాసాలు ఇస్తూ, తెలంగాణలో దాన్ని ఉల్లంఘిస్తున్నదే కాంగ్రెస్, రాహుల్ గాంధీ(Rahul Gandhi) అని మండిపడ్డారు.
Read Also: నెలాఖరుకు అసెంబ్లీ సమావేశాలు ?
Follow Us On: Youtube


