కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీఎండబ్ల్యూ బైక్ ఎక్కారు. బుధవారం రాహుల్ గాంధీ.. జర్మనీలో పర్యటించారు. ఇందులో భాగంగానే మునిచ్ ప్రాంతంలో ఉన్న బీఎండబ్ల్యూ వరల్డ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ విజిట్‌లో బీఎండబ్ల్యూ, టీవీఎస్ భాగస్వామ్యంతో రెడీ చేసిన టీవీఎస్ 450సీసీ (BMW-TVS 450cc) బైక్‌ను టెస్ట్ చేశారు. జర్మనీలో ఇండియన్ ఇంజినీరింగ్‌ను చూడటం చాలా గర్వించదగిన విషయమని కాంగ్రెస్ పేర్కొంది. రాహుల్ పర్యటనకు సంబధించిన వివరాలను కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్‌లో షేర్ చేసుకుంది. అందులో పలు కీలక అంశాలను కాంగ్రెస్ పంచుకుంది.
కాంగ్రెస్ తన పోస్ట్‌లో రాహుల్ వీడియోను షేర్ చేసుకుంది. అందులో రాహుల్.. ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్ రోజురోజుకు తగ్గిపోతోందని, ఆర్థిక అభివృద్ధికి కావాల్సిన ఎకో సిస్టమ్ అవసరం చాలా ఉందని పేర్కొన్నార.‘‘ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్ అభివృద్ధి చెందాలి. ఇండియా ఉత్పత్తిని ప్రారంభించాలి’’ అని గాంధీ అన్నారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఐదు రోజుల పాటు జర్మనీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఈవెంట్‌లో కూడా పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌లు పలువురు ఓవర్సీస్ నాయకులను రాహుల్ గాంధీ కలవున్నారు. గ్లోబల్ లెవెల్‌లో పార్టీ బలోపేతం గురించి వారితో చర్చించనున్నారు. వారికి పలు కీలక సూచనలు చేయనున్నారు. ఈ సమావేశంలో ఓవర్సీస్ నాయకులు.. ఎన్ఆర్ఐ సమస్యలను చర్చించనున్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్ సిద్దాంతాల వ్యాప్తికి సంబంధించిన ప్రణాళికలను వివరించానున్నారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ.. ప్రవాస భారతీయులను కూడా కలవనున్నారు.
అయితే పార్లమెంట్ సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ.. ఈ పర్యటనకు వెళ్లడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ రాహుల్ గాంధీని అతని సోదరి ప్రియాంకా గాంధీ డిఫెండ్ చేశారు. ‘‘ప్రధాని మోదీ తన పని వేళల్లో సగానికి పైగా సమయాన్ని దేశం బయటే గడుపుతారు. అలాంటప్పుడు ప్రతిపక్ష నేత పర్యటిస్తుంటే ఎందుకు వాళ్లు విమర్శిస్తున్నారు’’ అని ప్రియాంక ప్రశ్నించారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ.. డిసెంబర్ 20న భారత్‌కు చేరుకోనున్నారు. డిసెంబర్ 19తో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగుస్తాయి.
Read Also: అమెరికాకంటే ఇండియా డబుల్.. AI వాడకంలో మనమే టాప్!
Follow Us On: Youtube


