epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సచిన్​ను కలసిన భారత మహిళల అంధుల క్రికెట్​ జట్టు

కలం, వెబ్​డెస్క్​: భారత మహిళల అంధుల క్రికెట్​ జట్టు క్రికెట్​ దిగ్గజం సచిన్​ టెండూల్కర్​ (Sachin Tendulkar)​ను కలసింది. బుధవారం ముంబైలోని ఎంఐజీ క్రికెట్​ క్లబ్​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వాళ్లను కలిశారు. ఇటీవలే భారత మహిళల అంధుల క్రికెట్​ జట్టు T20 ప్రపంచ కప్​ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో సచిన్​ మాట్లాడారు. వారితో ఫొటోలు దిగారు. ఎన్నో అవరోధాలు దాటుకుంటూ కలలను సాకారం చేసుకున్నారని వారిని అభినందించారు.

కృషి, పట్టుదల, సాధన జట్టును ఈ స్థాయికి చేర్చిందని ప్రశంసించారు. కెప్టెన్​ దీపిక(Deepika) మాట్లాడుతూ సచిన్​(Sachin) లాంటి క్రికెట్​ దిగ్గజాన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆటపై ప్రేమతో, నమ్మకంతో ఆడామని, మా ప్రతిభను గుర్తిస్తూ సచిన్​ లాంటి గొప్ప వ్యక్తి ప్రశంసించడం మరచిపోలేనిదని అన్నారు. ఆయన మనస్సులోంచి వచ్చిన మాటలు తాము చిరకాలం గుర్తుంచుకుంటామని, భవిష్యత్తులో మరింత రాణిస్తామని దీపిక చెప్పింది.

Read Also:  హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన జైస్వాల్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>