ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు!

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ఉదయం నుంచి భానుడు భగ్గుమంటున్నాడు (AP Heatwave). దెబ్బతో జనం ఇంటి నుంచి బయటకు రావడానికి వణికిపోతున్నారు. రెండు రోజులుగా ఎండలు తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం రికార్డు స్థాయిలో 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నేడు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48.10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

కనిగిరిలో 48.03 డిగ్రీలు, అచ్చంపేటలో 47.71 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47.61 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగూడిపాడులో 47. 38 డిగ్రీలు, కంచిక చర్లలో 46.71 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ముఖ్యంగా బాపట్ల, ఏలూరు, మార్కాపురంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే మరో నాలుగు రోజుల పాటు టెంపరేచర్ మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని సూచించింది.

Read Also: కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ బ్యాన్.. అంతలోనే..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>