సీఎం రేవంత్, కేటీఆర్ ఆస్తులపై హైకోర్టులో పిటిషన్!

కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy), బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) కుటుంబాల ఆస్తులపై విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు అందజేసినట్లు ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు నాయకులు, ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలను ఇంగ్లీష్‌‌లోకి అనువాదం చేసి రాతపూర్వకంగా పిటిషన్ రూపంలో పంపినట్లు తెలిపారు.

​సిట్టింగ్ జడ్జితో విచారణకు విజ్ఞప్తి:

రేవంత్ రెడ్డి, కేటీఆర్ కుటుంబాలకు చెందిన ఆస్తులపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని ఎంపీ ర‌ఘునంద‌న్‌ అభ్యర్థించారు. అక్రమంగా ఆర్జించిన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసి, తెలంగాణ ప్రజలకు పంచాలని విజ్ఞప్తి చేశారు. ​ఇవే ఆధారాలు, పత్రాలతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా త్వరలోనే ఫిర్యాదు పంపుతున్నట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>