కలం, కరీంనగర్ : కరీంనగర్ లో నూతనంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్టర్లకు, అధికారులకు పనుల నాణ్యతపై పలు కీలక సూచనలు జారీ చేశారు. నిర్మాణ పనులన్నీ అత్యంత నాణ్యతతో జరగాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
రాబోయే 15 నుండి 20 సంవత్సరాల వరకు రోడ్లు, డ్రైనేజీల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. డ్రైనేజీ కాలువల నిర్మాణంలో నీరు నిలవకుండా సరిగ్గా ప్రవహించేలా స్లోప్‌లను కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలని స్పష్టం చేశారు. వర్షపు నీరు సులభంగా తరలిపోయేలా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ మేయర్ (Sunil Rao) ఆదేశించారు. దసరా పండుగ లోపే పనులన్నింటినీ వేగవంతంగా పూర్తిచేసి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందమైన రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు.

