Mobile Popup Ad
Mobile Popup Ad

గణేష్ గడ్డ దేవాలయానికి ప్రత్యేక ర్యాంపు

కలం, మెదక్ బ్యూరో: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక గణపతి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ర్యాంపు, మెట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్‌చెరు (Patancheru) ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారి విస్తరణశాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, ఆలయ కమిటీ పాలకవర్గం, స్థానిక ప్రజాప్రతినిధులతోకలిసి దేవాలయం సమీపంలో చేపడుతున్న పనులను పరిశీలించారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా గణేష్ గడ్డ

తెలంగాణ రాష్ట్రంలోనే గణేష్ గడ్డ దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందని, ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా గుడి సమీపంలో చేపడుతున్న పనుల మూలంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ రహదారి నుండి నేరుగా దేవాలయం పరిసరాల్లోకి వచ్చే విధంగా ప్రత్యేక ర్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు, స్వాగత తోరణం నుండి ఆలయం వరకు మెట్ల నిర్మాణం, నూతన ఆర్చ్ గుడి చుట్టూ 50 అడుగుల సామర్థ్యంతో సిసి ఫ్లోరింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిర్దేశించిన గడువులోగాపైన పేర్కొన్న పనులన్నీ పూర్తి చేయాలని జాతీయ రహదారుల డీఈ రామకృష్ణను ఆదేశించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకపోతే.. గుడి సమీపంలో అండర్ పాస్ సైతం నిర్మించాలని అధికారులకు సూచించారు.

Read Also: కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ బ్యాన్.. అంతలోనే..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>