ఏపీ ప్రభుత్వం బంపర్​ ఆఫర్​.. ముగ్గురు పిల్లలుంటే రూ.5 వేల ప్రోత్సాహం

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా సమతుల్యాన్ని కాపాడడానికి నగదు ప్రోత్సాహం అందించాలని ఉత్తర్వులు జరీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ముగ్గురు పిల్లలను కలిగిన కుటుంబాలకు రూ.5,000  ప్రోత్సాహకం అందించనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న జనాభా విధానంలో భాగంగా ఈ ప్రోత్సాహకాన్ని అర్హులైన కుటుంబాలకు అందించనున్నారు.

ఏపీలో జననాల రేటు తగ్గుతున్న నేపథ్యంలో కుటుంబాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అర్హత గల కుటుంబాలు సంబంధిత గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

అయితే, ఈ ప్రోత్సహకాలకు సంబంధించిన పూర్తి అర్హతలు, అమలు విధానం, దరఖాస్తు ప్రక్రియ, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశాలపై గవర్నమెంట్ త్వరలోనే సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేయనుంది. కాగా, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో జనాభా విధానంపై మరోసారి చర్చ మొదలైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>