కలం, వెబ్ డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణలో తెలంగాణ హైకోర్టు(TG High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాల సమర్పణ గడువును మరో రెండు రోజులు పొడిగించింది. వార్డుల వారీగా మ్యాపులను జనాభా సంఖ్యతో సహా 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని ఆదేశించింది.
జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో డిసెంబర్ 9న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది. దీనిపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వెల్లువెత్తుతున్న అభ్యంతరాలతో పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
సెన్సస్ కమిషనర్ నిర్దేశించిన డిసెంబర్ 31 డెడ్ లైన్ ను అడ్వకేట్ జనరల్ గుర్తు చేశారు. గడువు దగ్గర పడుతుండటంతో రెండు రోజులకు మించి పొడిగించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ల న్యాయవాదులు మూడు రోజులు పొడిగించాలని వాదించగా, రెండు రోజులు సరిపోతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
Read Also: ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది.. స్పీకర్ తీర్పుపై కేటీఆర్ ఫైర్
Follow Us On: Youtube


