epaper
Tuesday, November 18, 2025
epaper

బీహార్ పాలిటిక్స్‌లోకి AAP ఎంట్రీ..!

AAP Bihar | బీహార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన గంటల వ్యవధిలోనే ఆప్ ఈ ప్రకటన చేయడం ప్రస్తుతం కీలకంగా మారింది. రాష్ట్రంలో ఉన్న 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కూడా ఆప్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కూడా విడుదల చేసింది. ఇప్పటికే జాతీయ పార్టీ గుర్తింపు పొందిన ఆప్.. బీహార్‌లో పోటీకి నిలబడం ఇదే తొలిసారి. ఢిల్లీ, పంజాబ్‌లో అనుసరించిన విధానాలనే బీహార్‌లో కూడా అమలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అజేశ్ యాదవ్ వెల్లడించారు. ‘‘అభివృద్ధి, పాలనకు సంబంధించి మా దగ్గర విజయవంతమైన నమూనా ఉంది. ప్రజాసంక్షేమం విషయంలో ఆప్ చేసిన పనులను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. గతంలో ఢిల్లీలో ఆప్ సర్కార్ ఏర్పాటుకు పూర్వాంచల్ ప్రాంత ప్రజలు సహకరించారు. ఇప్పుడు బీహార్‌లో కూడా అండగా నిలుస్తారని ఆశిస్తాన్నాం’’ అని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ నమ్మకం వ్యక్తం చేశారు’’ అని అజేశ్ చెప్పారు.

ఓట్ల చీలకే టార్గెట్..

AAP Bihar | అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ రాజకీయాల్లోకి ఆప్ ఎంట్రీ ఇవ్వడం అనేక చర్చలకు దారితీస్తోంది. ఇది ఓట్ల చీలిక కోసమే వేసిన ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీహార్ ఎన్నికల్లో ప్రధాన పోటీ.. ఎన్‌డీఏ, మహాఘట్‌బంధన్ మధ్యే ఉండనుంది. ఈ సమయంలో కేజ్రీవాల్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా అక్కడ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆప్ అధికారికంగా ఇండి కూటమిలో లేకపోయినా.. ఎన్‌డీఏను దెబ్బతీయడానికి బీహార్‌లో ‘మహాఘట్‌బంధన్‌’కు తెరవెనక నుంచి సహకారం అందించొచ్చని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆప్ ఎంట్రీ కేవలం స్పష్టమైన విజేతలను తెలియజేయడానికే పనికొస్తుందని కూడా చర్చ జరుగుతోంది.

Read Also: అదరగొట్టిన భారత పారా అథ్లెట్స్.. చివరి రోజు 4 పతకాలు
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>