Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మరో మాస్ అప్డేట్

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ఎన్టీఆర్-నీల్'(NTRNeel) నుంచి మరో మాస్ అప్‌డేట్ వచ్చింది. “ ది బ్లాస్ట్ జోన్ ఆర్ రెడీ” (The Blast Zones Are Ready) అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానులలో మరింత హైప్ క్రియేట్ చేసింది. “ఎన్టీఆర్-నీల్ ఫస్ట్ గ్లింప్స్ ఈరోజు రాత్రి 11.52 గంటలకు” అని ప్రకటించడంతో ఫ్యాన్స్ అర్ధరాత్రి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ గ్లింప్స్‌ని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తం 5 భాషలలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ ప్రోమోని పోస్ట్ చేసారు. ఈ పోస్టులో ఎన్టీఆర్‌తో పాటు, మ్యూజిక్ డైరెక్టర్  రవి బస్రూర్, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, అలాగే టీ-సిరీస్ పేర్లను ట్యాగ్ చేయడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే “ది స్టార్మ్ అవేకెన్స్” వంటి పోస్టులతో భారీ బజ్ సృష్టించిన మేకర్స్, ఇప్పుడు “బ్లాస్ట్ జోన్స్” అంటూ సినిమాకు (NTRNeel) సంబంధించిన యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌పై హింట్ ఇచ్చినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also: జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.100 కోట్ల అక్రమాస్తులు!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>