Mobile Popup Ad
Mobile Popup Ad

అందానికి ఐస్ మంత్రం.. కొరియన్ బ్యూటీ సీక్రెట్ రివీల్!

కలం, వెబ్‌డెస్క్: Skin Icing Trend | నేటి కాలంలో యువత అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ ముఖాన్ని అందంగా ఉంచుకునేందుకు రకరకాల టిప్స్‌ను ఫాల్లో అవుతున్నారు. ప్రస్తుత కాలంలో అందం అంటే కేవలం పండుగలు, పెళ్లిళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. అది వారి దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. నిరంతరం ఫోటోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వీడియోలు షేర్ చేయడం వల్ల ఆకర్షణీయంగా కనిపించాలనే కోరిక యువతలో పెరిగింది.

ముఖ్యంగా చర్మ సౌందర్యం విషయానికి వస్తే, రసాయనాలతో కూడిన ఖరీదైన క్రీముల కంటే సహజసిద్ధమైన, తక్షణ ఫలితాలనిచ్చే వాటికే యువత ప్రాధాన్యతను ఇస్తున్నారు. వీటిలో ప్రస్తుతం ఫాల్లో అవుతున్న వాటిలో ప్రధానమైనంది స్కిన్ ఐసింగ్ ట్రెండ్ (Skin Icing Trend). కొరియన్ బ్యూటీ సీక్రెట్లలో ఒకటైన ఈ స్కిన్ ఐసింగ్ ట్రెండ్‌ను సెలబ్రిటీలు సైతం తమ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్‌‌లో ప్రాధాన్యత ఇస్తున్నారు.

స్కిన్ ఐసింగ్ ట్రెండ్‌

స్కిన్ ఐసింగ్ ట్రెండ్ అంటే ముఖాన్ని ఐస్ వాటర్‌లో ముంచడం లేదా ఐస్ క్యూబ్స్ మసాజ్ చేయడమే ఈ కోల్డ్ థెరపీ స్టైల్. ఐస్ మసాజ్ వల్ల రక్త ప్రసరణ జరిగి… తక్కువ సమయంలోనే ముఖం తాజాగా, కాంతిమంతంగా కనిపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఓపెన్ పోర్స్ మూసుకుంటాయట. చర్మం మృదువుగా మారి, మేకప్ వేసుకోవడానికి చక్కటి బేస్ సిద్ధమవుతుంది. ఇలా ఒకటా రెండా… ఎన్నెన్నో ప్రయోజనాలు… అలాగని కేవలం నీటితోనే కాదు.. గ్రీన్ టీ, రోజ్ వాటర్, కలబంద, కీరదోస-నిమ్మరసం… వంటి వాటితోనూ ఈ యాంటీ ట్యాన్ క్యూబ్స్ తయారు చేస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అయితే ఐస్‌తో ముఖాన్ని మసాజ్ చేసేటప్పుడు కొంత మంది ఐస్ ముక్కల్ని వస్త్రంలో వేసి ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా చేయకూడదట. నేరుగా ముఖంపై మసాజ్ చేయాలని సూచిస్తున్నారు. ఎక్కువ సేపు ఒకే ప్లేస్ లో ఉంచకుండా ఫేస్ అంతా మసాజ్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.

Read Also: గుమ్మడి కాయ కడుతున్నారా? ఈ పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>