కలం, వెబ్ డెస్క్: తనకు వారణాసి సెట్ చూడాలని ఉందని ప్రపంచదిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రాజమౌళి(Rajamouli)తో వ్యాఖ్యానించారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ (Avatar Fire and Ash) ప్రమోషన్లలో భాగంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అవతార్ న్యూ సిరీస్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరాన్ .. రాజమౌళి వీడియో కాల్‌లో మాట్లాడుకున్నార. అవతార్ ఫైర్ అండ్ ఆష్ గురించి వీరు చర్చించారు. క్రియేటివ్ నిర్మాణాల్లో ఎటువంటి అవాంతరాలు ఎదురవుతాయి. చిత్ర విడుదల సమయంలో వచ్చే అవాంతరాలు ఏమిటి? తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగిందని సమాచారం.
కామెరూన్(James Cameron) దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ ‘అవతార్’. ఇప్పటికే రెండు భాగాలు వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ముచ్చటగా మూడో భాగం ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ (Avatar Fire and Ash) డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం వినూత్న ప్రచారానికి తెరలేపింది. ఈ సినిమా గురించి రాజమౌళి జేమ్స్ కామెరూన్ వీడియో కాల్‌లో చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి(Rajamouli) మాట్లాడుతూ.. అవతార్ ఫైర్ అండ్ ఆష్ విడుదలకు ముందే చూడటం ఎంతో సంతోషంగా ఉంది. ఫైర్ అండ్ ఆష్ చూసినప్పుడు పిల్లవాడిలా చూస్తుండిపోయాను’ అని వ్యాఖ్యానించారు.
కామెరాన్ అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పాటూ భావోద్వేగాలను కూడా పండించారని ప్రశంసించారు.
హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్‌లో అవతార్ ఏడాది పాటు ప్రదర్శించబడిందని రాజమౌళి పేర్కొన్నారు. అవతార్ ఫ్రాంచైజీ ఇమ్మర్సివ్ బిగ్ స్క్రీన్ అనుభవాలకు బెంచ్‌మార్క్‌గా ఉందని ఆయన అన్నారు.
కామెరాన్ కూడా రాజమౌళి సినిమాటిక్ విజన్‌ను అభినందించారు. వారణాసి సెట్ చూడాలని ఉందని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 19న భారతదేశంలో 6 భాషల్లో (ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ) అవతార్ ఫైర్ అండ్ ఆష్ విడుదల కానుంది.
Read Also: అకిరా ఎంట్రీ ఎప్పుడు..? ఎవరితో..?
Follow Us On: X(Twitter)


