కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హైదరాబాద్ చేరుకున్నారు. శీతాకాల విడిది కోసం తెలంగాణ వస్తున్న రాష్ట్రపతి తాజాగా హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్నారు. ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు స్వాగతం పలికారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు హైదరాబాద్ లోనే పర్యటించబోతున్నారు. దీంతో ఆరు రోజుల పాటు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్, వై జంక్షన్-బొల్లారం చెక్ పోస్టు, కౌకూరు రోడ్డు, రిసాల బజార్, లక్డావాలా-అల్వాల్ టీ జంక్షన్, లోతుకుంట లాల్ బజార్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, తిరుమల గిరి ఎక్స్ రోడ్డు-కార్ఖానాతో పాటు మరిన్ని ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ద్రౌపది ముర్ము(Droupadi Murmu) తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Read Also: అకిరా ఎంట్రీ ఎప్పుడు..? ఎవరితో..?
Follow Us On: X(Twitter)


