Mobile Popup Ad
Mobile Popup Ad

పెండింగ్ ప్రాజెక్టులు ఏడాదిలోగా పూర్తి చేస్తాం: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగనీరు అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఇందులో భాగంగా నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) అన్నారు. ఆదివారం ధర్మపురి మండలం లోని అక్కేపల్లి చెరువును మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇరిగేషన్ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితమైన అక్కేపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు రోల్లవాగు ప్రాజెక్టు, వెల్గటూర్ ఎత్తిపోతల పథకం, పత్తిపాక రిజర్వాయర్ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు.

అక్కెపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు నియోజకవర్గంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని (Minister Uttam) కలవడం జరిగిందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలవడం జరిగిందని మంత్రి వివరించారు. ఏడాదిలోపు పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అక్కేపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిర్వహించే ఏజెన్సీ పని చేయకపోవడంతో వారి స్థానంలో కొత్త ఏజెన్సీకి అవకాశం కల్పించినట్లు మంత్రి వివరించారు. అక్క పెళ్లి రిజర్వాయర్ పనులు త్వరలోనే ప్రారంభించి రైతుల సూచనలు మేరకు నియోజకవర్గంలోని 5వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వ కాలంలో రోల్ల వాగు ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతి లేకుండానే పనులు ప్రారంభించారని మంత్రి (Adluri Laxman) ఆరోపించారు. ప్రాజెక్టు అంచనాలు పెంచి రైతులకు ఒక ఎకరానికి సైతం నీళ్లు ఇవ్వలేదని మంత్రి అన్నారు. రోళ్ళ వాగు ప్రాజెక్టు అటవీ శాఖ అనుమతులు సాధించి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం మొదటి విడతగా రూ. 118 కోట్లు విడుదల చేసిందని ఇందుకు సంబంధించిన పనుల టెండర్లు త్వరలోనే పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సమన్వయం చేసుకొని పుష్కరాల పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.

Read Also: జిమ్ సెల్ఫీలు తాత్కాలికం.. సిలిండర్లు ఎత్తే బలం శాశ్వతం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>