Mobile Popup Ad
Mobile Popup Ad

ఎబోలా విజృంభణ.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

కలం, వెబ్ డెస్క్ : ఎబోలా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉగాండా, దక్షిణ సూడాన్ లోని కాంగోలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతుండడంతో WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎబోలాకు ప్రస్తుతం టీకా అందుబాటులో లేదని వైద్యులు హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, కొవిడ్ మహమ్మారి లాంటి పరిస్థితి లేదని అంతర్జాతీయ సరిహద్దులను మూసేయవద్దని సూచించింది. కాగా, ఎబోలా వ్యాప్తికి బుండిబుగ్యో కారణం అని వైద్య నిపుణులు ధృవీకరించారు. ఇది అరుదైన వైరస్ అని దీనికి చికిత్స, టీకాలు లేవని పేర్కొంది. ఉగాండా, కాంగో తూర్పు ప్రావిన్స్ ఇటూరిలో శుక్రవారం ఈ వ్యాధి వ్యాప్తిని అధికారులు మొదట గుర్తించారు. శనివారం నాటికి 336 అనుమానిత కేసులు, 87 మరణాలు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, ఎబోలా వ్యాధికి మూలం అయిన బుండిబుగ్యో వైరస్‌ను మొదటిసారిగా 2007-2008లో ఉగాండాలోని బుండిబుగ్యో జిల్లాలో అధికారులు గుర్తించారు. అప్పుడు 149 మందికి వైరస్ సోకగా 37 మంది మరణించారు. రెండో సారి 2012లో కాంగోలోని ఇసిరోలో ఎబోలా వ్యాప్తి చెందగా 29 మరణాలు సంభవించాయి.

Read Also: పెట్రోలు, డీజిల్ ధరల పెంపు.. రేపు నిరసనలకు వైసీపీ పిలుపు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>