కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావుడి కనిపిస్తుండగా.. ఓ ఏడు గ్రామాలు పంచాయతీ ఎన్నికలను (Panchayat Polls) బహిష్కరించాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆయా గ్రామాల్లోని ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. కానీ ఏడు ఓ ఏడు గ్రామాల్లో గ్రామస్థులంతా ఏకమై ఎన్నికలు బహిష్కరించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు ఎన్నికలను
(Panchayat Polls) బహిష్కరించారు. వీటితోపాటు మరో ఐదు గ్రామాల ప్రజలు కూడా ఎన్నికలను బహిష్కరించారు. డిండీ నార్లాపూర్ ఎత్తిపోతల పథకం కింద నిర్మించ తలపెట్టిన జలాశయం వల్ల తమ గ్రామాలు ముంపునకు గురవుతాయనే భయంతో ఆయా గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు.
Read Also: మరో 20 దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్
Follow Us On: Pinterest


