కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని దేవితండా సమీపంలో ఈ సంఘటన జరిగింది. యూపీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి దేవీ తండాలో ఓ దాబా వద్ద లారీని ఆపాడు. మరో లారీలో ఇద్దరు దుండగులు వచ్చారు. లారీని అక్కడే ఆపి అనంతరం కాల్పులు (Firing) జరిపారు. దీంతో సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు చెందాడు. దుండగులు చంద్రాయన్‌పల్లి అనే గ్రామం వద్ద లారీని వదిలేసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన నిజామాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసింది.
Read Also: ఈ ఏడాది ‘అలెక్సా’ని ఎక్కువగా అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్
Follow Us On: Youtube


