కలం, వెబ్ డెస్క్ : కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి (Kondagattu Temple) అటవీశాఖ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఆలయ నిర్వహణ కమిటీకి నేరుగా అటవీశాఖ నోటీసులు జారీ చేసింది. ఆలయ నిర్వహణ కమిటీ అటవీశాఖ పరిధిలోని 684 బ్లాక్ లో దాదాపు 6 ఎకరాలు ఆక్రమించిందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఆరు ఎకరాల్లోనే అన్నదాన సత్రం, వాటర్ ప్లాంట్, వాహన పూడ షెడ్, సాగర్ గెస్ట్ హౌస్, ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ లాంటివి కట్టారని ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేశామన్నారు అటవీశాఖ అధికారులు.
ఆలయ నిర్వహణ కమిటీ చేసిన నిర్మాణాలకు కన్సర్వేషన్ యాక్ట్ 2ఏ ప్రకారం అటవీశాఖ పర్మిషన్ కచ్చితంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. ఈ నోటీసులకు సరైన వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంజన్న ఆలయాని(Kondagattu Temple)కి నోటీసులు జారీ చేయడంపై చర్చ మొదలైంది. మరి దీనిపై ఆలయ నిర్వహణ కమిటీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Also: ఈ ఏడాది ‘అలెక్సా’ని ఎక్కువగా అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్
Follow Us On: Instagram


