Mobile Popup Ad
Mobile Popup Ad

హనుమకొండలో దారుణం.. యువకుడిపై కత్తులతో దాడి

కలం, హనుమకొండ : హనుమకొండ (Hanumakonda) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్కతుర్తి (Elkathurthy) మండల కేంద్రంలోని తాళ్ల మండవ ప్రాంతంలో గొడిశాల విజయ్ కళ్యాణ్‌పై అక్కినపల్లి అఖిల్ కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో విజయ్ కళ్యాణ్ తీవ్రంగా గాయపడగా, అధిక రక్తస్రావం కావడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. దాడికి గల కారణాలపై ఆరా తీస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనతో తాళ్ల మండవ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read Also: మోదీ ఇంధన పొదుపు పిలుపు.. క్యాబ్ డ్రైవర్లకు కష్టకాలం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>