కలం, వెబ్ డెస్క్ : మాజీ సీఎం జగన్ కోర్టులంటే అస్సలు లెక్క చేయడని విమర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu). జగన్ అక్రమాస్తుల కేసుల్లో కోర్టులకు గత ఐదేళ్లలో ఎన్నడూ హాజరు కాలేదని.. ఇప్పుడు కూడా తప్పించుకోవాలని చూస్తున్నాడని చెప్పారు చంద్రబాబు. అమరావతిలో ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. జగన్(YS Jagan) తన హయాంలో జరిగిన చాలా అక్రమాలను తక్కువగా చేసి చెప్తున్నాడని.. కానీ అవన్నీ ప్రజల నమ్మకాలకు సంబంధించినవే అన్నారు చంద్రబాబు.
‘పరకామణి కేసును(Parakamani Case) చాలా చిన్న కేసుగా జగన్ చెబుతున్నాడు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను వైసీపీ ఎంపీలు తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. పరకామణి భక్తుల సెంటిమెంట్, నమ్మకానికి సంబంధించింది అని ఇప్పటికే కోర్టు తెలిపింది. పీపీపీ విధానంపై జగన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. ఆయనకు దానిపై అవగాహన లేదు. ఆయన టైమ్ లో ఒక్క మెడికల్ కాలేజీని కట్టలేదు’ అని విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు(Chandrababu).
Read Also: సంక్రాంతికి సై.. కోడి పందాలకు సిద్ధమవుతున్న గోదావరి జిల్లాలు
Follow Us On: Youtube


