కలం వెబ్ డెస్క్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) కర్ణాటకలోని మాండ్య జిల్లా మలవల్లిలో నిర్వహించిన ఆది జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర శివయోగి మహాస్వామిజీ 1066వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ వికసిత్ భారత్ (Viksit Bharat) లక్ష్యాన్ని సాధించాలంటే ఆధునిక విద్యను నైతిక విలువలతో మేళవించాలి అని స్పష్టం చేశారు. అలాగే ఆవిష్కరణలను పర్యావరణ బాధ్యతతో, ఆర్థిక వృద్ధిని సామాజిక సమానత్వంతో, అభివృద్ధిని కరుణతో కూడిన దృష్టితో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
దేశానికి కేవలం సాంకేతిక పురోగతితో పాటు, మానవీయ విలువలు సైతం అవసరమని రాష్ట్రపతి(Droupadi Murmu) పేర్కొన్నారు. విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించగలవని చెప్పారు. ఇందులో సుత్తూరు మఠం(Suttur Math) వంటి సంస్థలు కీలకమైన పాత్ర పోషించగలవన్నారు. భారతదేశాన్ని సమగ్రంగా అభివృద్ధి పథంలో నడిపించాలంటే విద్య, సంస్కృతి, సేవా భావం అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.
Read Also: ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు దేశవ్యాప్త నిరసన: కాంగ్రెస్
Follow Us On: Instagram


