కలం వెబ్ డెస్క్ : వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్ (Congress) నాయకుడు మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumantha Rao) మరోసారి సొంత పార్టీ నేతలపైనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మెదక్, సిద్ధిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ (BRS) కోవర్టు(coverts)లున్నారని వ్యాఖ్యానించారు.
మెదక్ (Medak), సిద్ధిపేట (Siddipet) జిల్లాలో పోలీసులు, అధికారులపై హరీష్ రావు (Harish Rao) ఇప్పటికీ పెత్తనం చెలాయిస్తున్నారని హనుమంతరావు ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులున్నారన్నారు. ఈ కోవర్ట్ సిస్టం పోతే వంద శాతం విజయం సాధిస్తామని తెలిపారు. ఇప్పటికే ఎన్నోసార్లు కోవర్టులను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపొమ్మని చెప్పినట్లు వెల్లడించారు. రాష్ట్రమంతా కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ కోవర్టులు ఉండవచ్చని, కానీ తనకు మెదక్, సిద్ధిపేట జిల్లాలపై మాత్రమే అవగాహన ఉందని చెప్పారు. సొంత పార్టీ నేతలపైనే మైనంపల్లి(Mynampally) ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో కోవర్టుల గురించి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read Also: ఎల్లారెడ్డి బాధితులను పరామర్శించిన కేటీఆర్
Follow Us On: X(Twitter)


