Mobile Popup Ad
Mobile Popup Ad

‘నేపాలీలతో జాగ్రత్త!’.. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: నేపాలీ పని మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) హెచ్చరించారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. నేపాలీలను పనిలో పెట్టుకున్న ఇళ్ల యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. పని మనుషుల ఫొటోలు, వ్యక్తిగత వివరాలు, ఆధార్ కార్డ్ సహా ఇతర గుర్తింపు కార్డులు, ఎవరి ద్వారా పనిలో చేరారనే వివరాలను కచ్చితంగా స్టానిక పోలీస్ స్టేషన్లలో అందించాలని సూచించారు.

ఇటీవల వరుస ఘటనలు..

నేపాలీలు (Nepalis) గతంలో ఎక్కువగా గూర్ఖా పనిలో చేరేవారు. తరువాత కాలంలో ధనవంతుల ఇళ్లల్లో పని మనిషులుగా చేరడం ప్రారంభించారు. ఇటీవల కొన్ని సంవత్సరాల్లో వీరి వ్యవహార శైలిలో చాలా మార్పులు వచ్చాయని చెబుతున్నారు. సంపదపై కన్నేసిన వీరు.. అవసరమైతే హత్యలకు కూడా వెనుకాడటం లేదు. బెంగళూర్, ముంబయిలో పలు హత్యలు చేయగా.. హైదరాబాద్‌లో ఏకంగా ఐపీఎస్ అధికారి భార్యనే హత్య చేసి డబ్బు, నగలతో ఉడాయించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ప్రకటన విడుదల చేశారు.

Read Also : భూపాలపల్లిలో దారుణం.. సొంత నానమ్మను చంపిన మనుమడు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>